Oct 24 2023అక్టోబరు 24 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : దశమి మ. 01గం౹౹03ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ధనిష్ఠ మ. 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : గండ మ. 03గం౹౹40ని౹౹వరకు తదుపరి వృద్ధి
కరణం :  గరజి మ. 03గం౹౹14ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹14ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & రా. 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 04గం౹౹34ని౹౹ నుండి 06గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹35ని౹౹కు

🕉️ విజయదశమి - దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీమాత అలంకారం🕉️

గురుబోధ శమీ (జమ్మి చెట్టు) వృక్షమును సాక్షాత్ పార్వతీదేవిగా మనం ఆరాధిస్తాం. పాండవులు, శ్రీరాముడు కూడా శమీపూజ చేసారని పురాణ వాక్యం. ముఖ్యంగా విజయదశమి రోజు తప్పక శమీపూజ చేయాలని, చేసిన వారికి తప్పక శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రం. శమీ పూజ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదువుకోవాలి.
1.  శమీ శమయతే పాపం  శమీ శత్రువినాశినీ
    అర్జునస్య ధనుర్ధారీ రామస్యాక్లిష్ట కర్మిణి
 
2.  శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా
    ధారిణ్యర్జునబాణానాం  రామస్య ప్రియవాదినీ 

శ్రీ లలితా త్రిశతి👇


శ్రీ లలితా సహస్రనామం👇


సంపూర్ణ శ్రీ దుర్గా సప్తశతి శ్లోక పారాయణము👇



expand_less