Oct 24 2022అక్టోబర్ 24 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 24 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : చతుర్దశి సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : హస్త మధ్యాహ్నం 02గం౹౹37ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం :  వైదృతి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹27ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం : శకుని ఈ రోజు  సాయంత్రం 05గం౹౹22ని౹౹ వరకు తదుపరి చతుష్పాధ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹41ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి  10గం౹౹29ని౹౹ నుండి 12గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 08గం౹౹35ని౹౹ నుండి 10గం౹౹11ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹45ని౹౹

👉🏻🕉️నరక చతుర్దశి🕉️

గురుబోధ
గ్రహణ సమయంలో ఒక్కసారి చేసిన మంత్ర జపం వెయ్యి రెట్ల ఫలితం ఇస్తుంది. గురోపదేశం లేని వారు భగవన్నామ జపం చేయాలి లేదా పురాణ శ్రవణం లేదా పురాణం చదవడం ఎంతో మంచిది.

గ్రహణం సమయంలో భూమిని త్రవ్వరాదు.

గర్బిణీ స్త్రీలు గ్రహణ సమయం లో తిరగ కూడదు, ముడుచుకొని ఉండకూడదు. పురాణ కాలక్షేపం వల్ల సత్సంతానం కలుగుతుంది.

గ్రహణం అయ్యాక ఇంటిని, దేవతా మందిరాన్ని శుద్ధి చేయాలి. ఇలా సాధ్యమైనంత వరకు గ్రహణ నియమాలు పాటిస్తే వారికి గొప్ప యజ్ఞ ఫలితం వస్తుంది. వారికి కష్టాలు రావని శాస్త్రం.


expand_less