"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐అక్టోబరు 23 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము తిథి : నవమి మ. 03గం౹౹11ని౹౹ వరకు తదుపరి దశమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం : శ్రవణం మ. 03గం౹౹47ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : శూల రా. 06గం౹౹53ని౹౹వరకు తదుపరి గండ కరణం : బాలవ ఉ. 06గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు & మ. 02గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : రా. 07గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹02ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 06గం౹౹02ని౹౹ నుండి 07గం౹౹32ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹36ని౹౹కు
మహర్నవమి - దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహిసాసుర మర్దిని అలంకారం
గురుబోధ తలపెట్టిన అన్ని కార్యాలలో విజయం సాధించడానికి, శత్రువులు కూడా మిత్రులు అవడానికి, భయంకర కష్టాలు, దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోవడానికి, అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణం ఎంతో మంచిది. వేదములు స్వయంగా అమ్మవారిని ఈ స్తోత్రంతో స్తుతించాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి చదివినా, విన్నా వాళ్ళలో స్వయంగా అమ్మవారు ఉంటుందని, వారికి సర్వశుభాలు ఇస్తానని అమ్మవారు వరం ఇచ్చింది. వేదస్తుతి - అమ్మవారిని 4 వేదాలు స్తుతించిన స్తోత్రం
శ్రీ అర్జునకృత దుర్గా స్తోత్రం
![]()