Oct 23 2022అక్టోబర్ 23 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 23 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : త్రయోదశి సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భానువారం  (ఆదివారం)
నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి హస్త
యోగం :  ఐంద్ర ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ వరకు తదుపరి వైదృతి
కరణం : వణిజ ఈ రోజు  సాయంత్రం 05గం౹౹58ని౹౹ వరకు తదుపరి భద్ర
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹14ని౹౹ నుండి 05గం౹౹00ని౹౹ వరకు
 వర్జ్యం : రాత్రి  10గం౹౹56ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 07గం౹౹04ని౹౹ నుండి 08గం౹౹43ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹15ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹45ని౹౹

🕉️మాస శివరాత్రి🕉️

గురుబోధ

1.గ్రహణం పట్టే 3 గంటల ముందు మరియు విడిచిన తర్వాత 3 గంటలు ఏమీ తినకూడదు.

2.గ్రహణం పట్టే ముందు(5, 10 ని॥ ముందు) స్నానం చేయాలి. గ్రహణం విడిచాక కట్టుక్కున్న బట్టలతో స్నానం చేయాలి.

3.ఇంటిలో దేవతా మందిరం, దేవతా మూర్తుల మీద మరియు వంట ఇంట్లో దర్భలు పరచాలి. గ్రహణం అయ్యాక మళ్లీ తిరిగి వంట వండుకోవాలి.

expand_less