కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి ఉ. 7.28 కు తదుపరి షష్ఠి 23 ఉ. 6.27 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: మృగశిర ఉ. 11.30 కు తదుపరి ఆర్ద్ర 23 ఉ. 11.17 కు
యోగం: పరిఘ ఉ. 08.46 కు తదుపరి శివ 23 ఉ. 06.59 కు
కరణం: గరజి మ. 01.52 కు తదుపరి వణిజ రా. 01.28 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.31 - 09.17 కు & రా. 10.46 - 11.36 కు
వర్జ్యం: రా. 7.48 - 9.23 కు
అమృతకాలం: రా. 1.23 - 2.58 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు
గురుబోధ:
నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలముకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. - శ్రీ నారదపురాణము