"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము
తిథి : సప్తమి రా. 07గం౹౹22ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : పూర్వాషాఢ రా. 06గం౹౹31ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : సుకర్మ 22వ తేదీ తె. 12గం౹౹37ని౹౹వరకు తదుపరి ధృతి
కరణం : గరజి ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹01ని౹౹ నుండి 07గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹46ని౹౹ నుండి 06గం౹౹16ని౹౹ వరకు & రా. 02గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹56ని౹౹ నుండి 03గం౹౹28ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు
🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మంగళగౌరీ దేవి అలంకారం🕉️
గురుబోధ దేవీ కవచం యొక్క మహిమ అత్యద్భుతమైనది. దీనిని చదివి ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం ఉండదు. ఉద్యోగం కావాలని ఈ కవచం చదివి ఆ ఉద్యోగ ప్రయత్నం చెయ్యండి, క్షణాలలో వస్తుంది. సంపద కావాలని శ్రద్ధతో వినండి, చదవండి, సంపదలు వస్తాయి. మాకు కీర్తి కావాలి, పదిమంది చేత ప్రశంసింపబడాలి అని ఈ కవచం చదవండి, మీకు ప్రశంసలు లభిస్తాయి. ఒకటి కాదు, సకల శుభాలూ కలిగిస్తుంది. భయంకర రోగాలు వచ్చినప్పుడు ఈ కవచమును పఠిస్తే ఆ వ్యాధులన్నీ తక్షణం నశించిపోతాయి. మన మీద ఎవరైనా ప్రయోగాలు, చేతబడులు చేసినా ఆ ప్రయోగాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ భూమండలంలో ఇంత అత్యద్భుతమైన కవచం చాలా అరుదుగా ఉంటుంది, అని త్రిమూర్తులు చెప్పారు. అటువంటి ఈ గొప్ప కవచాన్ని పారాయణము చేసుకోండి లేదా వినండి, రెండిటి ఫలితమూ ఒకటే. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం చేసేవారు, ఈ కవచం విన్న తరువాత లేదా పారాయణం చేసిన తరువాత సప్తశతిని పారాయణ చేస్తే మరింత శక్తివంతులవుతారు, అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది.
శ్రీ సిద్ధకుంజికా స్తోత్రం👇శ్రీ దేవీ కవచం👇శ్రీ అర్గళా స్తోత్రం👇