Oct 20 2026అక్టోబరు 20 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 20 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: నవమి ఉ.9.11 కు తదుపరి దశమి 21 ఉ.10.30 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శ్రవణం ప.3.43 కు తదుపరి ధనిష్ఠ 21 సా.5.27 కు
యోగం: శూల రా.12:49 కు తదుపరి గండ 21 రా.12:32 కు
కరణం: కౌలవ మ.12:50 కు, తైతుల రా.1:36 కు తదుపరి గరజి 21 మ.2:12 కు
రాహుకాలం: మ. 03.00 – 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.19 కు, రా. 10.46 – 11.36 కు
వర్జ్యం: రా.8.00 – 9.43 కు
అమృతకాలం: ఉ. 06.34 – 08.20 కు
సూర్యోదయం: ఉ. 6.14 కు
సూర్యాస్తమయం: సా. 5.47 కు

🕉️ విజయదశమి, శమీపూజ – శరన్నవరాత్రులు 10వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీమాత అలంకారం 🕉️

గురుబోధ:
🕉️దశమి నాడు అమ్మని పూజిస్తే ముల్లోకాధిపత్యం పొందుతారు. అందుకే పూర్వం ఇంద్రుడు అమ్మవారిని పూజించి ఇంద్రపదవిని తిరిగి పొందాడు.
🕉️విజయదశమి నాడు ఏ శుభకార్యము తలపెట్టినా, అది దిగ్విజయం అవుతుందని ప్రతీతి. ఆశ్వయుజమాసం శ్రవణానక్షత్రము నాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో అవతరించారు. దశమి నాడు తప్పక శమీపూజ చేసి, ఈ క్రింది శ్లోకాలను చదువుకొంటే సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. జమ్మిచెట్టుకి (శమీవృక్షం) 5 ప్రదక్షిణలు చేయాలి.

  1. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ |
    అర్జునస్య ధనుర్ధారీ  రామస్యాక్లిష్ట కర్మిణీ ||
  2. శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా |
    ధారిణ్యర్జునబాణానాం రామస్య ప్రియదర్శిని ||

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less