Oct 20 2023అక్టోబరు 20 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి రా. 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : మూల రా. 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : అతిగండ 21వ తేదీ తె. 03గం౹౹03ని౹౹వరకు తదుపరి సుకర్మ
కరణం :  కౌలవ మ. 12గం౹౹01ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & మ. 12గం౹౹10ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹14ని౹౹ నుండి 04గం౹౹44ని౹౹ వరకు & సా. 05గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹31ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹18ని౹౹ నుండి 02గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు

🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ సరస్వతీ దేవి అలంకారం, సరస్వతీపూజ🕉️

గురుబోధ
1) పరమపవిత్రమైన శ్రీ సరస్వతీమాతకు సంబంధించిన 108 నామాలను భక్తిశ్రద్ధలతో పఠించిన వారికి:  సరస్వతీకటాక్షం లభిస్తుంది. తిరుగులేని పాండిత్యం వస్తుంది. వాక్శుద్ధి కలుగుతుంది. వారి మాటకు అపజయం ఉండదు. అందునా పంచమినాడు, అష్టమి, నవమి, ఏకాదశి వంటి తిథులలోనూ, శరన్నవరాత్రులలోనూ, అమావాస్యనాడు, ఈ సరస్వత్యష్టోత్తర శతనామావళిని భక్తితో చదివినవాడు, విన్నవాడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడవుతాడు. పిల్లలకు ఈ అష్టోత్తర శతనామాలు కనుక కంఠస్థం వస్తే, ఇక వారి వంటి పండితులు మరొకరుండరు. అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం వారికి లభిస్తుంది.
2) రోజుకు 3 సార్లు చొప్పున 40 రోజులపాటు ఈ మహాసరస్వతీస్తవాన్ని పారాయణం చేస్తే, అలా చేసిన వ్యక్తి సరస్వతితో సమానమైన జ్ఞానం పొందుతాడు. ఒక సంవత్సర కాలం విడిచిపెట్టకుండా పఠించినవాడికి కాశీలో మరణించే యోగం లేదా కాశీలో మరణించడం వల్ల వచ్చే మోక్షమైనా లభిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ స్తోత్రం చదివిన వ్యక్తికి రాబోయే కాలంలో ఉత్తమజన్మ లభిస్తుంది. మాటలు సరిగా రానివారికి ఇది వినిపిస్తే స్పష్టంగా మాటలు వస్తాయి.
3) సరస్వతీ కవచాన్ని రోజూ మూడు పూటలా పారాయణ చేస్తే జ్ఞానం కలుగుతుంది. తన జీవితంలో 5 లక్షల మార్లు పారాయణం చేసినవాడు బృహస్పతితో సమానుడౌతాడు. ఈ కవచం అక్షరాభ్యాస సమయంలో పారాయణం చేయిస్తే పిల్లలకు మంచి విద్య లభిస్తుంది.

శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామావళి👇


సరస్వతీ కవచం👇



శ్రీమహాసరస్వతీ స్తవం👇


expand_less