" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 20 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : దశమి సాయంత్రం 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ఆశ్లేష ఉదయం 10గం౹౹27ని౹౹ వరకు తదుపరి మఘ యోగం : శుభ ఈ రోజు సాయంత్రం 05గం౹౹48ని౹౹ వరకు తదుపరి శుక్ల కరణం : భద్ర ఈ రోజు సాయంత్రం 04గం౹౹00ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 10గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹43ని౹౹ నుండి 03గం౹౹29ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 11గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 08గం౹౹41ని౹౹ నుండి 10గం౹౹27ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹ గురుబోధ మహాత్ములను, పీఠాధిపతులను, భక్తులను నిందిస్తే వెయ్యి జన్మలలో చేసిన అఖండ పుణ్యఫలితం కోల్పోతాము. భ్రష్టులై వంశంలో అకాల మరణాలు, తెలియని వింత రోగాలతో కుటుంబము అంతా సతమతం అవుతుందని శాస్త్రం.