Oct 19 2025అక్టోబరు 19 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 19 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి మ.3.37 కు తదుపరి చతుర్దశి 20 సా.4.40 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తర సా.6.30 కు తదుపరి హస్త 20 రా.8.09 కు
యోగం: ఐంద్ర 20 తె.3:33 కు తదుపరి వైధృతి 21 తె.3:26 కు
కరణం: వణిజ మ.1.52 కు తదుపరి గరజి రా.2.46 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:15-5:01 కు
వర్జ్యం: తె.3.28-5.10 కు
అమృతకాలం: ఉ.9.59-11.43 కు
సూర్యోదయం: ఉ. 5:56 కు
సూర్యాస్తమయం: సా. 5:34 కు

మాస శివరాత్రి, దివోదాస జయంతి, కేదారేశ్వర వ్రతం

గురుబోధ:
🕉️శివసహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది. బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాస్త్రం కంటే, నారాయణాస్త్రం కంటే గొప్పది."సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం" సకల వేదాలూ చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు, దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం శివసహస్రనామాన్ని చదవడం వల్ల, వినడం వల్ల పొందవచ్చును. అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదన్నారు. స్వయముగా ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మరాజుగారికి అందించినటువంటి అపూర్వ స్తోత్రం ఇది.
🕉️అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు.
https://youtu.be/AcS0VMMx3lU
దీపమునకు స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేష్ఠం. వాసన వచ్చే నూనె, నెయ్యి లేదా రసాయనాలు కలిపిన నూనెలతో 100 దీపములు వెలిగించినా పెద్ద ఫలితం ఉండదు. అదే శ్రేష్ఠమైన నూనె లేదా నెయ్యితో ఒక్క దీపం వెలిగించినా అనంతపుణ్యం లభిస్తుంది.

expand_less