కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ మ. 12.46 కు తదుపరి తదియ 20 ఉ. 10.44 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: భరణి మ. 02.32 కు తదుపరి కృత్తిక 20 మ. 01.14 కు
యోగం: సిద్ధి సా. 05.42 కు తదుపరి వ్యతీపాత 20 మ. 02.12 కు
కరణం: గరజి ఉ. 08.48 కు తదుపరి వణిజ రా. 08.13 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.57 - 07.44 కు
వర్జ్యం: రా. 1.53 - 3.23 కు
అమృతకాలం: ఉ. 10.04 - 11.34 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 5.52 కు
గురుబోధ:
పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జపతప లేదా ఇతర పుణ్యకార్యములు వేలరెట్ల ఫలితం ఇస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.