Oct 19 2023అక్టోబరు 19 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 19 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : పంచమి రా. 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : జ్యేష్ఠ రా. 08గం౹౹13ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : సౌభాగ్య ఉ. 06గం౹౹54ని౹౹వరకు తదుపరి శోభన
కరణం :  బవ మ. 12గం౹౹55ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు & మ. 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹59ని౹౹ నుండి 05గం౹౹32ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹31ని౹౹ నుండి 01గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹39ని౹౹కు

🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం🕉️

గురుబోధ
ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని త్రిసంధ్యలలో 40 రోజులు పారాయణం చేస్తే కుబేరునితో సమానమైన ఐశ్వర్యము, ఆనందము పొందుతారు. 5 లక్షల సార్లు జపిస్తే శాశ్వత వైకుంఠప్రాప్తి, నెల నాళ్ళు చదివితే లక్ష్మీ అనుగ్రహం పొంది పరమసుఖం పొందుతారని లక్ష్మీదేవి వరం.
సకల సంపదలు కావాలంటే, అనేక జన్మలలో మనం చేసిన పాపముల వలన లభించిన దారిద్య్రం తొలగాలంటే, తత్ క్షణం లక్ష్మీకటాక్షం లభించాలంటే శ్రీ లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరశతనామస్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయాలి లేదా వినాలి.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం👇


ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇


శ్రీ కనకధారా స్తోత్రం👇


expand_less