Oct 19 2022అక్టోబర్ 19 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 19 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : నవమి మధ్యాహ్నం 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : పుష్యమి  ఉదయం 08గం౹౹00ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం :  సాధ్య ఈ రోజు సాయంత్రం 05గం౹౹28ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు  
 వర్జ్యం : రాత్రి  10గం౹౹06ని౹౹ నుండి 11గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹48ని౹౹

 
గురుబోధ*
దేవతాకల్యాణములు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దర్శించేవారు మరియు  సహకరించేవారందరికీ సకల శుభములు కలుగుతాయి. పెళ్లి కానివారికి శీఘ్రంగా మంచివారితో వివాహం అవుతుంది. దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్ బాగుంటుంది.

expand_less