కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 18 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి మ.1.05 కు తదుపరి త్రయోదశి 19 మ.1.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పుబ్బ సా.5.19 కు తదుపరి ఉత్తర 19 సా.6.30 కు
యోగం: బ్రహ్మ 19 తె.4:02 కు తదుపరి ఐంద్ర 20 తె.3:33 కు
కరణం: తైతుల మ.1.06 కు తదుపరి గరజి రా.1.02 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:46-8:32 కు
వర్జ్యం: రా.12.52-2.31 కు
అమృతకాలం: ఉ.8.49-10.32 కు
సూర్యోదయం: ఉ. 5:56 కు
సూర్యాస్తమయం: సా. 5:34 కు
🕉️ విషువత్ పుణ్యకాలం, గురుద్వాదశి (శ్రీ పాద శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామి అంతర్థానం), శనిప్రదోషం🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చెయ్యాలి.
గురుబోధ:
⚡కలియుగంలో దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు గురుద్వాదశి రోజున కురువపురంలో అంతర్ధానం అయ్యారు.
దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం👇
https://youtu.be/TN1O0jpvUSQ?si=_BtjSSdJRe2VFrcL
⚡ శనైశ్చరుడు సాక్షాత్ సూర్యభగవానుని పుత్రుడు, కరుణా స్వరూపుడు. కాశీలో గొప్ప తపస్సు చేసి శివ అనుగ్రహంతో గ్రహాధిపతి అయ్యాడు. ధర్మప్రియుడు. అధర్మం చేసేవారిని శిక్షిస్తాడు.
⚡ నిత్యం నవగ్రహ ప్రదక్షిణ ఎంతో మంచిది. నవగ్రహాలనూ ఎప్పుడూ తక్కువ చేయరాదు. వారు గొప్ప తపస్సు చేసి గ్రహాధిపత్యం పొందారు. కేవలం శనికి తైలాభిషేకం చేస్తే తప్ప నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయ్యాక కాళ్లు కడుక్కోవడం ఏ శాస్త్రం లో చెప్పలేదు.
⚡దేవాలయాల్లో మూర్తులకు ముఖ్యంగా శనైశ్చరునికి ఎదురుగా నిలబడరాదు. ప్రక్కనుండి మాత్రమే నమస్కారం చెయాలి.
⚡ సిందూరం లేదా తమలపాకులతో హనుమంతుని పూజించడం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం, బెల్లం నువ్వులు నైవేద్యం పెట్టడం, నల్లని వస్త్రం ఇవ్వడం మరియు నిత్యం ఈ శ్లోక పారాయణ వల్ల శుభ ఫలితాలు పొందుతాం.
శ్లో|| కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం, నమస్యామి శనైశ్చరం
⚡శనిప్రదోషం - శివ పూజా ఫలితం!
⚡ప్రదోష సమయంలో శివ దర్శనం, అభిషేకము చాలా విశేషం. సకల కోరికలు తీరుతాయి.
⚡శనిప్రదోష పూజా ఫలితంగా శ్రీ అనసూయ అత్రి మహర్షికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు; శ్రీ సుమతి, శ్రీ అప్పలరాజులకి శ్రీ పాద శ్రీ వల్లభులు జన్మించారు.
ఈ రోజు నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
⚡ గాణగాపురం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు కూడా శనిప్రదోష పూజా ఫలితంగా వారి తల్లిదండ్రులకు జన్మించారు.
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=ZrxR8HLZ8tWhhP77
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
https://youtu.be/41P8HbBhQAs?si=I8piaWgDoTC4asIB
ఏలినాటి శని తొలగించే కథ👇
https://youtu.be/DZTHb0mK6hM?si=U87crLSe9heMKRpa