Oct 18 2024అక్టోబరు 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి మ. 3.01 కు తదుపరి విదియ 19 మ. 12.46 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అశ్విని సా. 4.02 కు తదుపరి భరణి 19 మ. 2.32 కు
యోగం: వజ్ర రా. 09.34 కు తదుపరి సిద్ధి 19 సా. 05.42 కు
కరణం: కౌలవ మ. 01.15 కు తదుపరి తైతుల రా. 11.29 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.17 కు & మ. 12.25 - 01.11 కు
వర్జ్యం: మ. 12.17 - 1.47 కు & రా. 1.02 - 2.32 కు
అమృతకాలం: ఉ. 9.20 - 10.50 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 5.52 కు

గురుబోధ:
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి. అర్ఘ్యం ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం.
యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః ! ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే!!

expand_less