Oct 18 2023అక్టోబరు 18 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి రా. 11గం౹౹34ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : అనూరాధ రా. 08గం౹౹31ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : ఆయుష్మాన్ ఉ. 08గం౹౹19ని౹౹వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  వణిజ మ. 01గం౹౹22ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹11ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹53ని౹౹ నుండి 03గం౹౹28ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹00ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹58ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹39ని౹౹కు

🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ లలితాదేవి అలంకారం🕉️

గురుబోధ
శ్రీ లలితాత్రిశతీ స్తోత్రం అమ్మవారి 300 నామములతో ఉండే సాక్షాత్తు జగన్మాత దివ్యస్వరూపం. సృష్టిలో ఉన్న ఏడు కోట్ల మంత్రములలో పంచదశీ అనేది ఒక మహామంత్రం. ఈ మహామంత్రమును 300 నామములుగా హయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడు. వాగ్దేవతలు స్వయంగా రచించిన దివ్యస్తోత్రములలో ఇది కూడా ఒకటి. అమ్మవారి 300 దివ్యనామములతో ఈ అపూర్వ స్తోత్రం కామేశ్వరుని, కామేశ్వరి యొక్క అలాగే అర్ధనారీశ్వర తత్త్వమును తెలియజేస్తుంది. భక్తిశ్రద్ధలతో విన్నా, పారాయణం చేసుకున్నా అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి.

శ్రీ లలితాత్రిశతి👇


expand_less