Oct 17 2025అక్టోబరు 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి మ.3.03 కు తదుపరి ద్వాదశి 18 మ.3.05 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఖ సా.4.38 కు తదుపరి పుబ్బ 18 సా.5.19 కు
యోగం: శుక్ల 18 తె.4:55 కు తదుపరి బ్రహ్మ 19 తె.4:02 కు
కరణం: బాలవ ఉ.11.12 కు తదుపరి కౌలవ 18 రా.11:42 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:19 కు, మ. 12:24-1:10 కు
వర్జ్యం: రా12.52-2.30 కు
అమృతకాలం: ఉ.11.26-01.07 కు
సూర్యోదయం: ఉ. 5:56 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

🕉️ ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి, తులా సంక్రమణం 🕉️
తులాసంక్రమణ పుణ్యకాలం: ఉ.9.58-సా.5.49 కు
మహాపుణ్యకాలం: ప.11.56-సా.5.49 కు

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ద్వాదశీపారణ రేపు చేయాలి.

గురుబోధ:
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అదికూడా కార్తిక మాసం లో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారు ఝామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి విఘ్ణ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు. ఏకాదశి రోజు జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనము చేసుకున్నవాడు జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాట వరుసకి కూడా దౌర్భాగ్యం పొందడు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less