Oct 17 2024అక్టోబరు 17 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: పూర్ణిమ సా. 5.17 కు తదుపరి పాడ్యమి 18 మ. 03.01 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: రేవతి సా. 5.34 కు తదుపరి అశ్విని 18 సా. 04.02 కు
యోగం: హర్షణ రా. 01.42 కు తదుపరి వజ్ర 18 రా. 09.34 కు
కరణం: విష్టి తె. 06.48 కు తదుపరి బవ సా. 04.55 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.04 - 10.51 కు & మ. 02.45 - 03.32 కు
వర్జ్యం: ఉ. 6.26 - 7.55 కు
అమృతకాలం: మ. 3.24 - 4.53 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 5.53 కు

🕉️ తులా సంక్రమణ, సంక్రమణ ప్రయుక్త విషువత్ పుణ్యకాలం, పద్మకయోగం, ఆశ్వయుజ పూర్ణిమ, కోజగిరి పూర్ణిమ, శ్రీ వాల్మీకిముని జయంతి 🕉️ ఉ. 7: 35 విషువత్ పుణ్యకాలం. సూర్యోదయాది నుండి పగలు 11 26 వరకు

గురుబోధ:
ఆశ్వయుజ పూర్ణిమ - ఆదికవి, ఆదికావ్యాన్ని అందించిన శ్రీ వాల్మీకిముని జయంతి. రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాతః స్మరణీయుడు. ఈ రోజు శ్రీ మద్రామాయణం లో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా విని తరిద్దాం!

https://youtu.be/rcwdYLX6PBQ?si=S3BnZq-Sx6EphXzO

expand_less