కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 16 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి 17 తె.3.20 కు తదుపరి సప్తమి 18 తె.5.25 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల 17 ఉ.8.31 కు తదుపరి పూర్వాషాఢ 18 ఉ.11.07 కు
యోగం: శోభన రా.10:05 కు తదుపరి అతిగండ 17 రా.11:02 కు
కరణం: కౌలవ సా.4:38 కు తదుపరి తైతుల 17 ఉ.5.54 కు, గరిజ 17 రా.7.12 కు
రాహుకాలం: ఉ. 10.30 – 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.19 కు, మ. 12.24 – 1.11 కు
వర్జ్యం: ప.2.48 – 4.35 కు
అమృతకాలం: రా. 02.39 – 04.27 కు
సూర్యోదయం: ఉ. 6.13 కు
సూర్యాస్తమయం: సా. 5.50 కు
🕉️ శరన్నవరాత్రులు 8వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం 🕉️
🕉️ సరస్వతీ పూజ, మూలా నక్షత్రం 🕉️
గురుబోధ:
పరమపవిత్రమైన శ్రీ సరస్వతీమాతకు సంబంధించిన 108 నామాలను భక్తిశ్రద్ధలతో పఠించిన వారికి: 🕉️ సరస్వతీకటాక్షం లభిస్తుంది. 🕉️ తిరుగులేని పాండిత్యం వస్తుంది. 🕉️ వాక్శుద్ధి కలుగుతుంది. 🕉️వారి మాటకు అపజయం ఉండదు. 🕉️ ప్రతిదినం దీనిని విన్నవారు, పఠించినవారు పూర్తిగా సరస్వతీ కటాక్షం పొందుతారు. 🕉️ అందునా పంచమినాడు, అష్టమి, నవమి, ఏకాదశి వంటి తిథులలోనూ, శరన్నవరాత్రులలోనూ, అమావాస్యనాడు, ఈ సరస్వత్యష్టోత్తర శతనామావళిని భక్తితో చదివినవాడు, విన్నవాడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడవుతాడు. 🕉️ భక్తులందరూ దీనిని స్వయంగా పఠించండి లేదా వినండి. 🕉️ మీ పిల్లలందరి చేత చదివించండి. 🕉️ పిల్లలకు ఈ అష్టోత్తర శతనామాలు కనుక కంఠస్థం వస్తే, ఇక వారి వంటి పండితులు మరొకరుండరు. 🕉️ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం వారికి లభిస్తుంది.
సరస్వతీ కవచం👇
https://youtu.be/27tV-fDbMec?si=cpot-ev5PGqf1-VG
సరస్వతీ అష్టోత్తర శతనామాలు👇
https://youtu.be/2GRKLWvzdhY?si=NM_DfKMd-lKjppRa
శ్రీ మహాసరస్వతీ స్తవం👇
https://www.youtube.com/embed/shgLSotVAQs