Oct 16 2023అక్టోబరు 16 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 16 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము

తిథి : విదియ రా. 12గం౹౹06ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : స్వాతి రా. 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : విష్కంభ ఉ. 10గం౹౹04ని౹౹వరకు తదుపరి ప్రీతి
కరణం :  బాలవ మ. 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 12గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹21ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹20ని౹౹ నుండి 12గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹40ని౹౹కు

🕉️ దేవీనవరాత్రుల సందర్భంగా శ్రీ ప్రణవపీఠంలో శ్రీ గాయత్రీదేవి అలంకారం🕉️

గురుబోధ
శరీరాన్నీ, మనస్సునీ అన్నింటినీ నిరంతరం రక్షించే దివ్యమైన కవచం గాయత్రీ కవచం, మహామంత్ర కవచం. వేయి గోవులు దానం చెయ్యటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్ర పారాయణ వలన వస్తుంది. భయంకర మహాపాపాల నుండి విముక్తి తక్షణం పొందేలా చేసే దివ్య కవచం ఇది. ఈ కవచాన్ని నిరంతరం పఠించేవాడు పరబ్రహ్మ స్వరూపుడైపోతాడు. 64 విద్యలు కరతలామలకం అవుతాయి. సకల బాధలు, ఒక బాధ కాదు, బాధా శతాలు (అనగా కొన్ని వందల బాధలు) తక్షణం తొలగిపోతాయి. ఈ కవచం ముక్తిని కూడా ఇస్తుంది.
శ్రీ గాయత్రీ హృదయం అనే దివ్యస్తోత్రం గాయత్రీదేవి హృదయాన్ని మన వైపునకు త్రిప్పే స్తోత్రం. అమ్మవారి హృదయాన్ని కరిగించి మనల్ని అనుగ్రహించేలా చేసే దివ్య స్తోత్రం. ఈ స్తోత్రం వలన ఏ పూట పాపం ఆ పూటే పోతుంది, ఏ రాత్రి పాపం అప్పుడే తొలగిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. తినకూడని పదార్థాలు తింటే వచ్చే పాపాలు తొలగిస్తుంది. మూర్ఖులతో స్నేహం చెయ్యడం వలన వచ్చే పాపాలు తొలగిస్తుంది. ఇలా ఒకటి కాదు, అనేక శుభ ఫలితాలను ఇచ్చే పరమదివ్య స్తోత్రం శ్రీ గాయత్రీ హృదయం.

గాయత్రీ కవచం👇


గాయత్రీ హృదయం👇


expand_less