" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 16 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఉదయం 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 02గం౹౹14ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : పరిఘ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి శివ కరణం : వణిజ ఈ రోజు ఉదయం 07గం౹౹03ని౹౹ వరకు తదుపరి భద్ర రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹17ని౹౹ నుండి 05గం౹౹04ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు ఉదయం 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹34ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹02ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹50ని౹౹ 🕉️భాను సప్తమి🕉️ గురుబోధ చనిపోయిన వ్యక్తి నోటిలో పంచరత్నములు వేయాలి. వీటిని ఉంచడం అనగా విత్తనములు నాటుట తో సమానం. పంచరత్నములు అనగా 1.బంగారం 2. వెండి 3. ముత్యము 4. నీలము 5. పగడం (శ్రీ గరుడపురాణం, ధర్మకాండము)