Oct 15 2026అక్టోబరు 15 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 15 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి రా.1.18 కు తదుపరి షష్ఠి 17 తె.3.20 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ 16 తె.5.57 కు తదుపరి మూల 17 ఉ.8.31 కు
యోగం: సౌభాగ్య రా.9:14 కు తదుపరి శోభన 16 రా.10:05 కు
కరణం: బవ మ.2:16 కు, బాలవ 16 తె.3.25 కు తదుపరి కౌలవ 16 సా.4:38 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 – 10.52 కు, మ. 2.44 – 3.31 కు
వర్జ్యం: ఉ.9.44 – 11.29 కు
అమృతకాలం: రా. 08.58 – 10.45 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.51 కు

🕉️ శరన్నవరాత్రులు 5వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ కాళీమాత అలంకారం 🕉️

గురుబోధ:
శ్రీ లలితాత్రిశతీ స్తోత్రం అమ్మవారి 300 నామములతో ఉండే సాక్షాత్తు జగన్మాత దివ్యస్వరూపం. సృష్టిలో ఉన్న ఏడు కోట్ల మంత్రములలో పంచదశీ అనేది ఒక మహామంత్రం. ఈ మహామంత్రమును 300 నామములుగా హయగ్రీవుడు అగస్త్యునికి బోధించాడు. వాగ్దేవతలు స్వయంగా రచించిన దివ్యస్తోత్రములలో ఇది కూడా ఒకటి. అమ్మవారి 300 దివ్యనామములతో ఈ అపూర్వ స్తోత్రం కామేశ్వరుని, కామేశ్వరి యొక్క అలాగే అర్ధనారీశ్వర తత్త్వమును తెలియజేస్తుంది. భక్తిశ్రద్ధలతో విన్నా, పారాయణం చేసుకున్నా అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి.

శ్రీ లలితాత్రిశతి👇
https://youtu.be/FS-o_aSJRd0?si=sPMIR7Xwmug4AEV6

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less