"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబరు 15 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షము తిథి : పాడ్యమి రా. 11గం౹౹33ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భానువారము (ఆదివారం) నక్షత్రం : చిత్త రా. 06గం౹౹22ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం : వైధృతి ఉ. 10గం౹౹25ని౹౹వరకు తదుపరి విష్కంభ కరణం : కింస్తుఘ్న మ. 12గం౹౹01ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹07ని౹౹ నుండి 04గం౹౹54ని౹౹ వరకు వర్జ్యం : రా. 12గం౹౹15ని౹౹ నుండి 01గం౹౹56ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹41ని౹౹కు 🕉️ దేవీనవరాత్రులు ప్రారంభం🕉️ గురుబోధ అమ్మవారికి ఇష్టమైనవి 4 మాసాలు ఆశ్వయుజ మాసం,మాఘ మాసం,చైత్ర మాసం, వైశాఖ మాసం. వసంత నవరాత్రులు , శరత్ కాలంలో వచ్చే నవరాత్రులు (అనగా శుక్ల పక్షం లో పాడ్యమి మొదలు నవమి వరకు) ఇవి రెండూ అమ్మకి మరింత ఇష్టం. శరన్నవరాత్రులు యముని కోరలు (మృత్యు దేవత స్వరూపం). ఒకానొకప్పుడు అమ్మవారు అతి భయంకరమైన యమదంష్ట్ర లాంటి సంధికాలంలో ఋతువు నుంచి ఋతువు మారే క్రమంలో మానవులు రోగముల నుండి విముక్తి పొందడానికి సులభోపాయం చెప్తున్నాను అని “నేను చెప్పినట్టుగా చేసుకుంటే మానవులకు వారికున్న రోగాలు తొలగిపోతాయి. పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజుల పాటు నన్ను భక్తిశ్రద్ధలతో పూజించండి. 10 వ రోజు విజయదశమినాడు చేయవలసిన కార్యక్రమాలు మానవులకి నేను విధిస్తున్నాను, వాటి ప్రకారం నన్ను ఆ 10 రోజులు విశేషంగా అలంకారం చేసి పసుపుతో, కుంకుమతో వివిధమైన పుష్పాలతో, ఫలాలతో, ధూపంతో, దీపంతో, నైవేద్యాలతో నన్ను అర్చిస్తే అటువంటి వారికి మాటవరుసకు కూడా అనారోగ్యం లేకుండా చేస్తాను, వాళ్ళని బాగుపరుస్తాను" అని పలికింది.