కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 14 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్థి రా.11.30 కు తదుపరి పంచమి 15 రా.1.18 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ 15 తె.3.35 కు తదుపరి జ్యేష్ఠ 16 తె.5.57 కు
యోగం: *ఆయుష్మాన్ రా.8:38 కు తదుపరి సౌభాగ్య 15 రా.9:14 కు
కరణం: వణిజ మ. 12.17 కు, విష్టి రా.1.13 కు తదుపరి బవ 15 మ. 2.16 కు
రాహుకాలం: మ. 12.00 – 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.38 – 12.25 కు
వర్జ్యం: తె.5.51 -7.35 కు
అమృతకాలం: మ. 04.37 – 06.23 కు
సూర్యోదయం: ఉ. 6.12 కు
సూర్యాస్తమయం: సా. 5.51 కు
🕉️ శరన్నవరాత్రులు 4వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
అగస్త్యకృత లక్ష్మీస్తోత్రం
https://youtu.be/yUXkM_QhZgA?si=rxRczXo7KjzzyUI8
ఇంద్రకృత లక్ష్మీస్తోత్రం👇
https://youtu.be/if5zzw20GaQ?si=J-1M6WexyB1maJZH