"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 14 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య రా. 10గం౹౹34ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : హస్త సా. 04గం౹౹46ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : ఐంద్ర ఉ. 10గం౹౹25ని౹౹వరకు తదుపరి వైధృతి
కరణం : చతుష్పాద ఉ. 10గం౹౹40ని౹౹ వరకు తదుపరి నాగ
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹18ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹14ని౹౹ నుండి 11గం౹౹58ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు
🕉️ మహాలయ అమావాస్య🕉️
గురుబోధ
మహాలయ అమావాస్య పితృదేవతలకు పర్వదినం. స్వర్గస్తులైన వారు ఎవ్వరైనా సరే (బంధువులు, స్నేహితులు) వారి పేరు మీద తర్పణాలు, స్వయంపాకం (వంటసరుకులు, కూరగాయలు) బ్రాహ్మణులకు ఇవ్వడం మహాలయ అమావాస్య నాడు చేయాలి. పితృతర్పణాలు, పిండ ప్రదనాలు అర్హత కలిగిన వారు మాత్రమే ఇవ్వాలి. స్వయంపాకం ఎవ్వరైనా ఇవ్వవచ్చు.
పితృదేవతా స్తోత్రం👇అమావాస్య వైశిష్ట్యం👇
https://youtu.be/OBwT8oxE1z4?si=W0UFR67DDvVqrnMf