Oct 14 2022అక్టోబర్ 14 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 14 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : పంచమి  తెల్లవారి 04గం౹౹52ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భృగువారం  (శుక్రవారం)
నక్షత్రం : రోహిణి  రాత్రి 08గం౹౹49ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం :  వ్యతీపాత ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹58ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం : కౌలవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹01ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹12ని౹౹ వరకు  
 వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹07ని౹౹ నుండి 01గం౹౹51ని౹౹ వరకు & రాత్రి 03గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ నుండి 07గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹

వ్యతీపాత యోగం- పితృతర్పణం

గురుబోధ

దశవిధపాపాలు (పది రకాల పాపాలు)
1. పరుష భాషణం - కఠినంగా మాట్లాడడం
2. అనృత భాషణం - అసత్యాలు పలకడం
3. పైశున్య భాషణం - కొండెములు (చాడీలు) చెప్పడము ; లేనిపోనిది కల్పించి ఒకరిమీద మరొకరికి చెప్పి జనుల మధ్య తగాదాలు పెట్టుట.
4. అసంబద్ధ ప్రలాపము  సంబంధం లేని మాటలు మాట్లాడుట 
5. అదత్తో పాదానము - తనకు ఇవ్వని వస్తువును తీసుకొనుట.
 6. అవిధాన హింస - వేదాలకు వ్యతిరేకంగా జీవులను బాధపెట్టుట. అనవసరంగా జీవులను చంపడం
7. పరదారోపసేవ - పర స్త్రీలతో తిరగడం
8. పర ధన వ్యామోహం -  మనసులో ఇతరుల ధనం గురించి ఆలోచించడం. పరధనం అపహరించాలని కోరడం.
 9. పరులకు కీడు చేయాలని ఆలోచించడం 
10. పనికిమాలిన విషయాలపై ఆసక్తి కలిగి ఉండడం.

ఈ మొత్తం పది పాపాలను దశవిధ పాపాలు అంటారు. ఇవి తొలగడానికి నిత్యం సద్గురువులను సేవించడం, భగవత్ సేవ చేయడం, ఆలయ దర్శనం, ప్రదక్షిణలు, గోసేవ, పురాణ శ్రవణం వంటివి చేయాలి. ముఖ్యంగా నవరాత్రులలో కొల్హాపురంలోని మహాలక్ష్మీదేవి దర్శనానికి వెళ్లడం వల్ల ఇవి తొలగుతాయని అగస్త్యులు చెప్పారు.
-అష్టాదశ శక్తిపీఠాలు పుస్తకం నుండి


expand_less