"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబరు 13 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : చతుర్దశి రా. 09గం౹౹04ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : భృగువారము (శుక్రవారం) నక్షత్రం : ఉత్తర మ. 02గం౹౹39ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : బ్రహ్మ ఉ. 10గం౹౹06ని౹౹వరకు తదుపరి ఐంద్ర కరణం : విష్టి ఉ. 08గం౹౹54ని౹౹ వరకు తదుపరి శకుని రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹16ని౹౹ నుండి 09గం౹౹03ని౹౹ వరకు & మ. 12గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు వర్జ్యం : రా. 11గం౹౹47ని౹౹ నుండి 01గం౹౹31ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 06గం౹౹43ని౹౹ నుండి 08గం౹౹28ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹56ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు గురుబోధ ఈ మహాలయ పక్ష కాలంలో పితృదేవతలకు శ్రాద్ధము, పిండప్రదానము ఒక పురోహితుడిని పెట్టుకుని జరిపిస్తే అందునా మహాలయ పక్షంలో చిట్టచివరన అమావాస్య నాడు శ్రాద్ధం జరిపిస్తే ఈ పితృదేవతల యొక్క దోషాలు తొలగిపోతాయి. ప్రేతాత్మలకి విముక్తి కలుగుతుంది. వాళ్ళు ఊర్ధ్వ లోకాలకి వెళతారు. దీనివల్ల మన సంసారములో ఉన్న కష్టాలు, నష్టాలు అన్నీ తొలగిపోతాయి. తెలిసి కానీ తెలియక కానీ మనకి ఇలాంటి కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ ప్రేతాత్మల వల్ల వస్తున్నాయి.ఈ మహాలయం వల్ల అవి తొలగిపోతాయి. పితృదేవతా స్తోత్రం👇 https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw