Oct 12 2025అక్టోబరు 12 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 12 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం

తిథి: షష్ఠి రా.9.25 కు తదుపరి సప్తమి 13 రా.7.35 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మృగశిర రా.7.43 కు తదుపరి ఆరుద్ర 13 రా.6.25 కు
యోగం: వరీయాన్ సా.5.36 కు తదుపరి పరిఘ 13 మ.2.47 కు
కరణం: వణిజ మ.2.17 కు తదుపరి విష్టి రా.1.16 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:19-5:06 కు
వర్జ్యం: రా.3.40-5.10 కు
అమృతకాలం: రా.2.55 - తె.4.27 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు

🕉️ భాను షష్ఠీ పర్వదినం🕉️

గురుబోధ:
షష్ఠీతిథి (భాను షష్ఠీ పర్వదినం) సందర్భముగా శ్రీ మద్దేవీభాగవతంలోని శ్రీ షష్ఠీదేవి (దేవసేనా) స్తోత్రమును 11 సార్లు లేదా అంతకు మించి ఎక్కువ సార్లు పారాయణం చేయమని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు శిష్యులందరినీ ఆజ్ఞాపించారు.
ఫలశ్రుతి: పిల్లలు ఆరోగ్యవంతులవుతారు. ఆయువు పెరుగుతుంది. సకల శుభాలు పొందుతారు. సర్పదోషాల నుండి విముక్తి పొందుతారు.
శ్రీ సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఈ క్రింది శ్లోకమును కుడా నిత్య పారాయణము చేస్తే మంచిదని శాస్త్రము
శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననమ్ !
దారుణం రిపురోగఘ్నమ్ భావయేత్ కుక్కుటధ్వజం !!

షష్ఠీదేవి స్తోత్రము: https://youtu.be/z5AyoV476mQ?si=uLTFHvgm5povIJrZ

షష్ఠీ దేవి చరిత్ర https://youtu.be/LfLYabYVKMU?si=6fKMLL1Tuz52hVAN

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less