Oct 12 2024అక్టోబరు 12 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి 13 తె. 4.11 కు తదుపరి ఏకాదశి 14 రా. 02.25 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శ్రవణం రా. 12.45 కు తదుపరి ధనిష్ఠ 13 రా. 11.45 కు
యోగం: ధృతి రా. 12.22 కు తదుపరి శూల 13 రా. 09.26 కు
కరణం: కౌలవ ఉ. 10.58 కు తదుపరి తైతుల రా. 10.08 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.09 - 07.43 కు
వర్జ్యం: తె. 4.35 - 6.51 కు
అమృతకాలం: మ. 2.43 - 4.16 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 5.56 కు

🕉️ విజయదశమి - శరన్నవరాత్రులు 10వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీమాత అలంకారం 🕉️

గురుబోధ:
విజయదశమి నాడు ఏ శుభకార్యము తలపెట్టినా, అది దిగ్విజయం అవుతుందని ప్రతీతి. ఆశ్వయుజ మాసం శ్రవణానక్షత్రము నాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో అవతరించారు.
దశమి నాడు తప్పక శమీపూజ చేసి, ఈ క్రింది శ్లోకాలను చదువుకొంటే సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి.
1. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్యాక్లిష్ట కర్మిణీ

2. శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా
ధారిణ్యర్జునబాణానాం రామస్య ప్రియవాదినీ

expand_less