Oct 12 2023అక్టోబరు 12 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి రా. 07గం౹౹15ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం : పుబ్బ మ. 12గం౹౹15ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : శుక్ల ఉ. 09గం౹౹30ని౹౹వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  గరజి ఉ. 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹38ని౹౹ వరకు & మ. 02గం౹౹34ని౹౹ నుండి 03గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹10ని౹౹ నుండి 09గం౹౹55ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹25ని౹౹ నుండి 06గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹55ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹43ని౹౹కు

👉🏻🕉️మాసశివరాత్రి🕉️

గురుబోధ
'రుచి' అనే ప్రజాపతి ఉన్నాడు. ఆయన పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము. ఈ 15రోజులు భక్తితో పారాయణం చేయాలి. పితృదేవతలకు వెండి చాలా ఇష్టం. ఈ మహాలయపక్షకాలములో వెండిని చూచుట, దానము చేయుట వెండి పాత్రలోనే అర్ఘ్యప్రదానం తిలోదకాలు మొదలైన  పనులు చేయుట మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ కాలంలో వెండిపళ్ళెం లో తర్పణాలు విడిచి పెట్టడం మంచిది. వెండి దానం వల్ల‌ మొండిసమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ మొత్తం 15రోజులు వీలుంటే బ్రహ్మచర్య దీక్ష పాటించడం మంచిది. దానివల్ల  పితృదేవతల కటాక్షం సంపూర్ణముగా లభిస్తుంది.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
expand_less