Oct 12 2022అక్టోబర్ 12 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 12 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము 

తిథి : తదియ  రాత్రి 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : సౌమ్యవారం  (బుధవారం)
నక్షత్రం : భరణి  సాయంత్రం 05గం౹౹13ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం :  వజ్ర ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹22ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹46ని౹౹ వరకు తదుపరి భద్ర
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు 
 వర్జ్యం : ఈ రోజు తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 12గం౹౹15ని౹౹ నుండి 01గం౹౹54ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹53ని౹౹



గురుబోధ

ఎంతో కొంత పుణ్యము, దానము, ధర్మము చేయకపోతే భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు. జగద్గురువులు శంకరాచార్యులు ఒకసారి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణి శంకరులకు ఏమీ ఇవ్వలేకపోతున్నానని బాధపడింది.  అప్పుడు శంకరులు లక్ష్మీదేవిని  ప్రార్థించగా, ఆవిడ ఏ పుణ్యము, దానం ఇదివరకు చేయలేదు. అందుకే ప్రస్తుతం దారిద్య్రం అనుభవిస్తోంది. నేను ఎటువంటి పుణ్యమూ అడ్డుపెట్టి సంపద ఇవ్వలేకపోతున్నాను అంటుంది. కనీసం ఇప్పుడు ఏదైనా నీకు సమర్పిస్తే ఆమెకు తరగని సంపదలను ఇస్తాను అంటుంది. అందుకే వయస్సు, ఆరోగ్యం అన్నీ బాగున్నప్పుడే దానధర్మాలు, తీర్థయాత్రలు చేయాలి.


expand_less