Oct 11 2023అక్టోబరు 11 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : ద్వాదశి సా. 05గం౹౹17ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : మఖ ఉ. 09గం౹౹41ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : శుభ ఉ. 07గం౹౹47ని౹౹వరకు తదుపరి శుభ
కరణం :  బాలవ మ. 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు 
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹13ని౹౹ వరకు
వర్జ్యం : రా. 06గం౹౹32ని౹౹ నుండి 08గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹39ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు & ఉ. 07గం౹౹01ని౹౹ నుండి 07గం౹03ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹55ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹44ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.

గురుబోధ
సదాచారాలను పాటించేవారు దేవతలకు, పితృదేవతలకు ప్రీతిపాత్రులు అవుతారు.  అశౌచకాలంలో సరైన నియమాలను పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహము పొందలేము. ఉదా౹౹  మృతాశౌచం ఉన్న  రోజులలో ( 10, 12 లేదా 15 రోజులు) లేదా స్త్రీలు బయట ఉన్న 3 రోజులు అగ్నిని తాకడం, దేవతా మూర్తులను, ఇంటిలో అన్ని వస్తువులను తాకడం, వంట చేయడం,  అందరినీ కలుపుకోవడం చేయరాదు.  ఇటువంటి తప్పులు చేసి ఎన్ని ప్రదక్షిణలు, జపాలు, హోమాలు, దాన ధర్మాలు చేసినా దేవతల అనుగ్రహం కలుగదు. అందుకే సాధ్యమైనంత వరకు ఆచారములు పాటించాలి. అవే మన పిల్లలని,  భవిష్యత్ తరాలని కాపాడుతాయి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
expand_less