" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 11 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి : విదియ రాత్రి 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి తదియ వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : అశ్విని సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి భరణి యోగం : హర్షణ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹19ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹36ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి సాయంత్రం 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹32ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹38ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹55ని౹౹ వరకు & రాత్రి 02గం౹౹18ని౹౹ నుండి 03గం౹౹57ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 09గం౹౹04ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹44ని౹౹ గురుబోధ గో, దేశ, ధర్మసంరక్షణ చేసే వారి వెంట భగవంతుడు ఉంటాడు. మహాభారతంలో దుష్టబుద్ధి గల కౌరవులు విరాటరాజ్యంలో ఉన్నగోవులని అపహరిస్తారు. వాటిని రక్షించడానికి అర్జునుడు ఒక్కడే ఉత్తర గోగ్రహణం లో కౌరవ సైన్యం లో ఉన్న వీరులను, సైన్యాన్ని అందరిని ఒక్కపూట లో జయించాడు. అదే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను జయించడానికి 18 రోజులు పట్టింది. కారణం అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవులతో యుద్ధం చేసింది గోవులను రక్షించడానికి, కానీ కురుక్షేత్రంలో యుద్ధం చేసింది వారి రాజ్యాన్ని వారు పొందడానికి. గోవుల కోసం, దేశ సంరక్షణ కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తే మనకు తెలియకుండానే భగవంతుడు మనకు అన్నీ కార్యాలు సులభము చేస్తాడు.