Oct 10 2026అక్టోబరు 10 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 10 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య రా.8.27 కు తదుపరి శు.పాడ్యమి 11 రా.8.28 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: హస్త రా.9.59 కు తదుపరి చిత్ర 11 రా.10.40 కు
యోగం: ఐంద్ర రా.10:02 కు తదుపరి వైధృతి 11 రా.9:05 కు
కరణం: చతుష్పాద ఉ.9:24 కు, నాగ రా.9:20 కు తదుపరి కింస్తుఘ్న 11 రా.9:31 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.45 – 8.32 కు
వర్జ్యం: ఉ.6.16 – 7.52 కు
అమృతకాలం: మ. 03.35 – 05.13 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.54 కు

🕉️ మహాలయ అమావాస్య, దర్శ శ్రాద్ధం 🕉️

గురుబోధ:
పితృ కార్యక్రమాల గురించి తెలుసుకున్నా పితృ దేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు. అందుకే పితృ కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి

🔺ప్రతి అమావాస్యకు, చనిపోయిన తమ పితరులు వారి ఇంటి గుమ్మం దగ్గర వచ్చి వారి పిల్లలు తర్పణాలు, పిండములు (వారికి జలము, ఆహారం) ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్న వారికి మనం తర్పణాలు, పిండములు లేదా బ్రాహ్మణులకు స్వయంపాక దానము మొ౹౹ ఇవ్వకపోతే, ఇలాంటి పుత్రులను కన్నందుకు బాధపడి, ఆ వంశాన్ని, వారి పిల్లల్ని శపించి వెళ్ళిపోతారు. అదే వారికి తగిన తర్పణం, దానం మొ౹౹ ఇస్తే ఆకలి దాహం తీరిన వారు తృప్తితో వంశాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతారు. వారి పిల్లలకు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షిస్తారు. అందుకే చనిపోయిన వారి కోసం తర్పణాలు, దానాలు వంటివి చేసి తీరాలి.
🔺మహాలయపక్షంలో హరిహరుల స్మరణ చాలా మంచిది. ‘రుచి’ అనే ప్రజాపతి పితృదేవతలని స్తుతించాడు. రుచి ప్రజాపతి చేసిన పితృస్తవము ఈ 15 రోజులు భక్తితో పారాయణ చేయాలి. అమావాస్య నాడు ఈ స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి పితృదేవతల యొక్క కటాక్షం లభిస్తుంది.
🔺సూర్యోదయానికి ముందే ప్రతి ఇంటి గడప ముందు రంగవల్లి (ముగ్గు) ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని మరియు ముగ్గు వేయడం ద్వారా దేవతలని ఇంటికి ఆహ్వానించినట్లు అని పెద్దల మాట. మరి కొన్ని ప్రత్యేక దినములలో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అంటారు. ఎప్పుడు?
◆ పితృదేవతలను ఆహ్వానించే రోజు అనగా శ్రాద్ధ కర్మలు నిర్వహించే రోజు మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయరాదు. అమావాస్య లేదా నైమిత్తిక తిథులలో ఇచ్చే తర్పణములకు ఈ నియమం లేదు.
🔺శ్రాద్ధముకు వండే వంట చాలా జాగ్రత్తగా మడితో చేయాలి.  భోక్తలకు నివేదన కాకుండా మనం రుచి చూడడం, వండిన పదార్థాలలో వెంట్రుకలు వంటివి ఉండడం, భోక్తలు భోజనం చేస్తుండగా తుమ్మడం వంటివి చేయరాదు. ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఒక దోషం లేకుండా చేయడం కష్టం. ఇలా తెలియనివి ఏవైనా దోషాలు  తొలగాలంటే భోక్తలు భోజనం చేసే విస్తరిలో ఒక దళం ఉంచితే ఆ దోషాలు మనకు  అంటవు. ఆ దళం ఏమిటి?
◆ తులసీ దళం
🔺 పితృదేవతలకు జరిపే క్రతువులలో దోషాలు ఉన్నా, ఎవరైనా బంధుమిత్రులలోని వారు అకాలమరణం పొందినా, పితరులకు ఉత్తమగతులు అందించాలన్నా ఒకే ఒక ఉత్తమ మార్గం ఏమిటి?
◆ భాగవత సప్తాహం జరిపించుట

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less