Oct 10 2024అక్టోబరు 10 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి ఉ. 7.18 కు తదుపరి అష్టమి 11 ఉ. 6.45 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా. 1.41 కు తదుపరి ఉత్తరాషాఢ 11 రా. 1.41 కు
యోగం: అతిగండ 11 తె. 04.37 కు తదుపరి సుకర్మ రా. 02.47 కు
కరణం: వణిజ మ. 12.31 కు తదుపరి విష్టి రా. 12.24 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.05 - 10.52 కు & మ. 02.49 - 03.36 కు
వర్జ్యం: మ. 11.09 - 12.46 కు
అమృతకాలం: రా. 8.55 - 10.32 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 5.58 కు

🕉️ శరన్నవరాత్రులు 8వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ దుర్గాదేవి అలంకారం 🕉️

శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళి
https://youtu.be/GNNNIDBcOV0?si=FD7lBJ3crteQboYe
https://srivaddipartipadmakar.org/stotram/sri-durgashtottara-satanaamaavali/pcatid/108/

గురుబోధ:
శ్రీ దుర్గాష్టోత్తర శతనామపారాయణం వలన అష్టకష్టాల్లో నుండి బయటపడతారు, అష్టైశ్వర్యాలను పొందుతారు, దీనిని నిరంతరం పారాయణం చేస్తే ఆత్మబలం, జ్ఞానం పెరుగుతాయి, పనులు చెయ్యడానికి కావలసిన శక్తి లభిస్తుంది, ఈ నామాలను శుచిగా ఉండి భక్తిశ్రద్ధలతో ఎప్పుడైనా పారాయణం చేసుకోవచ్చు. కానీ, అష్టమి, నవమి, చతుర్దశి అనే మూడు తిథులూ అమ్మవారికి చాలా ఇష్టం. అటువంటి పవిత్రకాలాల్లో చేస్తే తిరుగులేని అద్భుతఫలితం లభిస్తుంది.
• శ్రీ మద్దేవీభాగవత గ్రంథములో 12 స్కంధములు మొత్తం పారాయణము చేయలేని, వారు కనీసం 9వ స్కంధం అయినా పారాయణము చేసుకోవచ్చు, అది సకల పుణ్యప్రదం, సర్వ శుభదాయకం.

expand_less