Oct 09 2026అక్టోబరు 09 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 09 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి రా.8.57 కు తదుపరి అమావాస్య 10 రా.8.27 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఉత్తర రా.9.48 కు తదుపరి హస్త 10 రా.9.59 కు
యోగం: బ్రహ్మ రా.11:20 కు తదుపరి ఐంద్ర 10 రా.10:02 కు
కరణం: విష్టి ఉ.9.53 కు, శకుని రా.9:36 కు తదుపరి చతుష్పాద 10 రా.9:24 కు
రాహుకాలం: ఉ. 10.30 – 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.19 కు, మ. 12.26 – 1.13 కు
వర్జ్యం: తె.5.10 -6.45 కు
అమృతకాలం: మ. 02.07 – 03.43 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.55 కు

🕉️ ఘాత చతుర్దశి, మాస శివరాత్రి 🕉️

గురుబోధ:
🕉️ఆలయంలో పూలమొక్కలు, బిల్వము, తులసి లేదా ఇతర మొక్కలు నాటి వాటిని చక్కగా పెంచి పోషిస్తే తప్పక కైలాసం, వైకుంఠం లేదా మణిద్వీపం వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదని నందీశ్వరుడు అభయం ఇచ్చాడు. – శ్రీ లింగపురాణం
🕉️శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు ఇన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. – శ్రీ శివమహాపురాణం
🕉️భోక్తలు మనింట్లో భోజనం చేయము అనే పక్షంలో ఏమి చేయాలి?
◆ వారికి తప్పనిసరిగా ఇద్దరికి వండుకొని తినగలిగే ఆహార పదార్థములు ఇవ్వాలి. వాటినే స్వయంపాకం అంటారు. అందులో బియ్యం, పెసరపప్పు ఉండాలి. కందిపప్పు పనికిరాదు, ఆవునేతిని దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు..
భోక్తలకు ఏ ఏ దానాలు చేస్తే ఏ ఏ ఫలితాలు పొందుతాము?
◆ భోక్తలకి తద్దినం నాడు తాటాకు విసనకర్ర, వస్త్రములు, సువర్ణం శక్తి కొలది దానం చేయాలి. భోక్తలకు గోవుని దానం చేస్తే అటువంటి వాడు 3200 సంవత్సరములు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తాడు. తాటాకు విసినకర్ర దానం ఇస్తే 1000 సంవత్సరాలు గంధర్వుల చేత గౌరవింపబడతారు. చెప్పులు, గొడుగు ఈ రెండూ శ్రాద్ధకాలంలో దానం చేస్తే అపుడు పితృదేవతలే కాదు కర్త కూడా (తదనంతరం) దివ్యవిమానంలో స్వర్గానికి వెళ్ళిపోతాడు.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less