కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 09 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: విదియ ఉ.7.21 తదుపరి తదియ 10 తె.5.01 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: భరణి రా.12.35 కు తదుపరి కృత్తిక 10 రా.10.53 కు
యోగం: వణిజ రా.8:32 కు తదుపరి సిద్ధ 10 సా.5:41 కు
కరణం: వణిజ మ.12.38 కు తదుపరి విష్టి రా.10.54 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:06-10:53 కు, మ. 2:47-3:34 కు
వర్జ్యం: ఉ.11.13-12.43 కు
అమృతకాలం: మ.3.47-5.12 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
గురుబోధ:
పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జపతప లేదా ఇతర పుణ్యకార్యములు వేలరెట్ల ఫలితం ఇస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.