కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 09 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి ఉ. 7.24 కు తదుపరి సప్తమి 10 ఉ. 7.18 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మూల రా. 1.29 కు తదుపరి పూర్వాషాఢ 10 రా. 1.41 కు
యోగం: సౌభాగ్య తె. 06.37 కు తదుపరి శోభన 10 తె. 05.53 కు
కరణం: తైతుల మ. 12.14 కు తదుపరి గరజి రా. 12.28 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.39 - 12.27 కు
వర్జ్యం: ఉ. 9.01-10.40 కు & రా. 11.50 - 1.29 కు
అమృతకాలం: రా. 6.58 - 8.36 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 5.58 కు
🕉️ శరన్నవరాత్రులు 7వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ సరస్వతీదేవి అలంకారం 🕉️
శ్రీ సరస్వత్యష్టోత్తరరమ్
https://youtu.be/2GRKLWvzdhY?si=pPsy4ZMpJn4e_uB9
https://srivaddipartipadmakar.org/stotram/sri-saraswati-ashtottara-satanamaavali/pcatid/108/
శ్రీ సరస్వతీ కవచమ్
https://youtu.be/q8czyMJzLqA?si=jS9zUsPOIcDYVr1r
https://srivaddipartipadmakar.org/stotram/sri-saraswati-armor/pcatid/108/
గురుబోధ:
పరమపవిత్రమైన శ్రీ సరస్వతీమాతకు సంబంధించిన 108 నామాలను భక్తిశ్రద్ధలతో పఠించిన వారికి: 🕉️ సరస్వతీకటాక్షం లభిస్తుంది. 🕉️ తిరుగులేని పాండిత్యం వస్తుంది. 🕉️ వాక్శుద్ధి కలుగుతుంది. 🕉️వారి మాటకు అపజయం ఉండదు. 🕉️ ప్రతిదినం దీనిని విన్నవారు, పఠించినవారు పూర్తిగా సరస్వతీ కటాక్షం పొందుతారు. 🕉️ అందునా పంచమినాడు, అష్టమి, నవమి, ఏకాదశి వంటి తిథులలోనూ, శరన్నవరాత్రులలోనూ, అమావాస్యనాడు, ఈ సరస్వత్యష్టోత్తర శతనామావళిని భక్తితో చదివినవాడు, విన్నవాడు సాక్షాత్తు సరస్వతీ స్వరూపుడవుతాడు. 🕉️ భక్తులందరూ దీనిని స్వయంగా పఠించండి లేదా వినండి. 🕉️ మీ పిల్లలందరి చేత చదివించండి. 🕉️ పిల్లలకు ఈ అష్టోత్తర శతనామాలు కనుక కంఠస్థం వస్తే, ఇక వారి వంటి పండితులు మరొకరుండరు. 🕉️ అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం వారికి లభిస్తుంది.