"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబరు 09 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : దశమి మ. 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : ఆశ్లేష పూర్తిగా ఉంది యోగం : సిద్ధ ఉ.07గం౹౹04ని౹౹వరకు తదుపరి సాధ్య కరణం : విష్టి మ. 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹13ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు & మ.02గం౹౹36ని౹౹ నుండి 03గం౹౹23ని౹౹ వరకు వర్జ్యం : రా. 06గం౹౹38ని౹౹ నుండి 08గం౹౹24ని౹౹ వరకు అమృతకాలం : తె. 03గం౹౹29ని౹౹ నుండి 05గం౹17ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹55ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹56ని౹౹కు గురుబోధ ప్రతి సంవత్సరము పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) - మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు - 13 వ్యతీపాత యోగములు - 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం, పుష్యం, మాఘం , ఫాల్గునం - బహుళ (కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. పితృదేవతా స్తోత్రం👇 https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw