కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రా.9.53 కు తదుపరి చతుర్దశి 9 రా.8.57 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుబ్బ రా.10.03 కు తదుపరి ఉత్తర 9 రా.9.48 కు
యోగం: శుక్ల రా.12:58 కు తదుపరి బ్రహ్మ 9 రా.11:20 కు
కరణం: గరజి ఉ. 10.44 కు, వణిజ రా.10:16 కు తదుపరి విష్టి ఉ.9:53 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.06 – 10.53 కు, మ. 2.48 – 3.35 కు
వర్జ్యం: ఉ.6.30 – 8.03 కు
అమృతకాలం: మ. 03.00 – 04.35 కు
సూర్యోదయం: ఉ. 6.11 కు
సూర్యాస్తమయం: సా. 5.56 కు
🕉️ ప్రదోషం, గజచ్ఛాయా, మహాలయపక్షాలు (పితృపక్షములు), 12వ దినము 🕉️
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
20. దేవ కార్యాలకు, పండుగలకు సూర్యోదయంలో ఉన్న తిథి ముఖ్యము అంటారు. మరి పితృ కార్యాలకు ఏ సమయమును పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రం?
◆ మధ్యాహ్నం 12 గం౹౹ ఉన్న తిథి ముఖ్యము
21. దర్భ అడుగున బ్రహ్మ, మధ్య నారాయణుడు, తుది యందు శివుడు ఉందురు. ఇంత పవిత్రత దర్భకు ఎందుకు వచ్చింది? దర్భ ఎలా ఉత్పన్నమైనది? s
◆ శ్రీమహావిష్ణువు రోమముల నుండి దర్భ ఉత్పన్నమైనది. అందుకే దర్భకు అంత పవిత్రత. దర్భ ఇంటిలో తప్పక ఉండి తీరాలి.
22. పితృకార్యాలు జరిగే ప్రదేశంలో నువ్వులను చల్లితే అక్కడికి దైత్యులు, దానవులు, అసురులు రారని శాస్త్రం. అంత పవిత్రత కలిగిన నువ్వులు ఎక్కడ నుండి ఉత్పన్నమైనవి?
◆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వేద జలం నుండి నువ్వులు ఉత్పన్నమైనవి.
23. మరణం ఆసన్నమైన వారికి దుర్గతి కలగకుండా హరి సన్నిధానమునకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా ఏవి తోడ్పడుతాయని శాస్త్రం?
◆ తులసి, హరినామ స్మరణం, గురుభక్తి , గంగాజలం
24. మరణం ఆసన్నమైనవారి ఎదుట ఏ దానం ఇస్తే వారికి స్వర్గపు వాకిలి తెరవబడును?
◆ గంగాజలంతో ఉన్న పాత్ర, గొడుగు, చెప్పుల జత, సాలగ్రామముతో కూడిన స్వయం పాకము.
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw