కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 08 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము కృష్ణ పక్షం
తిథి: ఆశ్వయుజ బహుళ పాడ్యమి ఉ.9.21 కు తదుపరి విదియ 9 ఉ.7.21
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అశ్విని రా.2.19 కు తదుపరి భరణి 9 రా.12.35 కు
యోగం: హర్షణ రా.1:32 కు తదుపరి వజ్ర 9 రా.8:32 కు
కరణం: తైతుల సా.4.08 కు తదుపరి గరజి రా.2.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:40-12:27 కు
వర్జ్యం: రా.10.32-12.02 కు
అమృతకాలం: సా.4.21-5.46 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
గురుబోధ:
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి. అర్ఘ్యం ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం.
యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః | ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే ||