కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి ఉ. 6.58 కు తదుపరి షష్ఠి 09 ఉ. 6.58 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: జ్యేష్ఠ రా. 12.48 కు తదుపరి మూల 09 రా. 01.29 కు
యోగం: ఆయుష్మాన్ తె. 06.51 కు తదుపరి సౌభాగ్య 09 తె. 06.37 కు
కరణం: బాలవ ఉ. 11.17 కు తదుపరి కౌలవ రా. 11.50 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.17 కు & రా. 10.51 - 11.39 కు
వర్జ్యం: తె.5.39 - 7.09 కు
అమృతకాలం: మ. 3.38 - 5.18 కు
సూర్యోదయం: ఉ. 6.08 కు
సూర్యాస్తమయం: సా. 5.59 కు
🕉️ శరన్నవరాత్రులు 6వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మంగళ గౌరీ దేవీ అలంకారం 🕉️
గురుబోధ:
శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన వలన అమ్మవారి అనుగ్రహం శీఘ్రముగా పొందవచ్చు. అమ్మవారి సంపూర్ణ చరిత్ర ఉన్న శ్రీ దేవీభాగవత పురాణం పారాయణం లేదా శ్రవణం చేయడం, చండీ సప్తశతి లోని శ్లోక పారాయణము లేదా శ్రీ లలితాసహస్రనామము మొ౹౹ స్తోత్ర పారాయణము చేయడం చాలా మంచిది. ఎన్నో వేల జన్మల సంస్కారం, పుణ్యం, అమ్మవారి దయ ఉంటేనే గానీ శ్రీ దేవీ భాగవత పురాణం వినడం లేదా పారాయణము చేసే భాగ్యం కలగదు.