Oct 08 2023అక్టోబరు 08 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 08 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : నవమి ఉ. 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : పుష్యమి 9వ తేదీ తె. 04గం౹౹26ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : సిద్ధ పూర్తిగా ఉంది తదుపరి సాధ్య
కరణం :  గరజి ఉ. 10గం౹౹12ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు 
దుర్ముహూర్తం : సా. 04గం౹౹11ని౹౹ నుండి 04గం౹౹59ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹02ని౹౹ నుండి 12గం౹౹46ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹29ని౹౹ నుండి 11గం౹23ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹47ని౹౹కు

🕉️ రవిపుష్యయోగం🕉️

గురుబోధ
వ్రతములు, పండుగలు చేసి దేవతల అనుగ్రహం పొంది కోరిన కోర్కెలు ఎలా నెరవేర్చుకొంటామో అలానే శ్రాద్ధం, తర్పణాలు మొ౹౹ ఇచ్చి పితృదేవతలను తృప్తిపరిచి కోరిన కోర్కెలు, పాపనివృత్తి కూడా చేసుకోవచ్చని శాస్త్రం. - శ్రీ మార్కండేయ పురాణం, హరివంశము.
"రవిపుష్యయోగం" - పుష్యమీ నక్షత్రంతో కలిసిన ఆదివారం నాడు చేసే మంచిపనులు విశేష ఫలితాన్ని ఇస్తాయి. జపదానతర్పణాలు కూడా మరింత విశేషఫలితం ప్రసాదిస్తాయి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
expand_less