Oct 07 2024అక్టోబరు 07 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: పంచమి పూర్తి తదుపరి షష్ఠి
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: అనూరాధ రా. 11.36 కు తదుపరి జ్యేష్ఠ 08 రా. 12.48 కు
యోగం: ప్రీతి తె. 06.40 కు తదుపరి ఆయుష్మాన్ 08 తె. 06.51 కు
కరణం: విష్టి ఉ. 08.47 కు తదుపరి బవ రా. 10.36 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.27 - 01.15 కు & మ. 02.50 - 03.37 కు
వర్జ్యం: తె. 05.29 - 7.01 కు
అమృతకాలం: మ. 12.34 - 2.16 కు
సూర్యోదయం: ఉ. 06.07 కు
సూర్యాస్తమయం: సా. 06.00 కు

🕉️ శరన్నవరాత్రులు 5వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం 🕉️

https://youtu.be/yUXkM_QhZgA?si=bwFUaPzZOMlpFweW

గురుబోధ:
అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.

expand_less