Oct 07 2023అక్టోబరు 07 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబరు 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము

తిథి : అష్టమి ఉ. 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : స్థిరవారం (శనివారం)
నక్షత్రం : పునర్వసు రా. 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : శివ 8వ తేదీ ఉ. 06గం౹౹03ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  కౌలవ ఉ. 08గం౹౹08ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు 
దుర్ముహూర్తం : ఉ. 05గం౹౹59ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹27ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం : రా. 11గం౹౹46ని౹౹ నుండి 01గం౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹47ని౹౹కు

గురుబోధ
భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం). పితృదేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్యనాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw
expand_less