"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబరు 06 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము తిథి : సప్తమి ఉ. 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఆర్ద్ర రా. 12గం౹౹34ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : పరిఘ 7వ తేదీ తె. 05గం౹౹31ని౹౹ వరకు తదుపరి శివ కరణం : బవ ఉ. 06గం౹౹34ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹17ని౹౹ నుండి 09గం౹౹04ని౹౹ వరకు & మ. 12గం౹౹15ని౹౹ నుండి 01గం౹౹03ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 08గం౹౹09ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు అమృతకాలం : మ. 02గం౹౹02ని౹౹ నుండి 03గం౹43ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹48ని౹౹కు 🕉️ మధ్యాష్టమి పర్వదినం, మన్వంతరం🕉️ గురుబోధ పితృదేవతలు 7 రకముల గణములు. అందులో 3 మూర్తి (రూపం) లేని గణములు, 4 మూర్తి గణములు మూర్తి (రూపం) లేని గణములు 1. వైరాజులు 2. అగ్నిష్వాత్తులు 3. బర్హిషదులు మూర్తి గణములు 1. సుకాలినులు 2. హవిష్మంతులు 3. ఆజ్యపులు 4. సోమపులు - (శ్రీ మత్స్యపురాణం) పితృదేవతా స్తోత్రం👇 https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw