కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 05 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి 6 తె.3.00 కు తదుపరి ఏకాదశి 7 రా.1.00 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పుష్యమి రా.1.02 కు తదుపరి ఆశ్లేష 6 రా.11.45 కు
యోగం: శివ ఉ.9:51 కు తదుపరి సిద్ధ 6 ఉ.7:20 కు
కరణం: వణిజ మ.2:59 కు, విష్టి రా.2.08 కు తదుపరి బవ 6 మ.1:19 కు
రాహుకాలం: ఉ. 07.30 – 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.28 – 1.15 కు, మ. 2.49 – 3.36 కు
వర్జ్యం: ఉ.10.02 – 11.32 కు
అమృతకాలం: సా. 05.01 – 06.33 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 5.58 కు
గురుబోధ:
🔺గారెలు, పరమాన్నం ఒకే రోజు చేయరాదు. అవి రెండూ కలిపి తింటే మాంసంతో సమానం. అందుకే కేవలం పితృ కార్యాలలో కలిపి చేస్తారు.
🔺పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు నువ్వులు నీళ్ళు ఎలా ఇవ్వాలి? ఎన్ని నువ్వులు ఉండాలి?
◆ కొన్ని నువ్వులు తీసుకుని వాటితోనే అన్ని తర్పణములు చేయరాదు. ప్రతి తర్పణముకు నువ్వులు తీసుకోవాలి. కనీసం 7 లేదా అంతకు మించి ఎక్కువ నువ్వులు అయినా ఉండాలి.
🔺ముఖ్యముగా ఏ కూరగాయలు మరియు పదార్థాలు శ్రాద్ధ భోజనానికి, స్వయంపాకమునకు (కూరగాయలు, వంట సామగ్రి మొ౹౹) నిషిద్ధము?
◆ దోసకాయ, ఆనపకాయ, అలసంద, ఉల్లి, వెల్లుల్లి, క్యారట్, ఆలూ, వంకాయ, పెండలం, టమోట, కొర్రలు, వెలగ, అవిసె, ఇంగువ వంటి సుగంధ ద్రవ్యాలు, కందిపప్పు, కొత్తరకం కూరగాయలు (క్యాబేజీ, కాలిఫ్లవర్, క్యాప్సికమ్ మొ|| )
🔺శ్రాద్ధ భోజనానికి వేటితో వండితే పితృదేవతలు మరింత సంతోషిస్తారు ? స్వయంపాకమునకు (కూరగాయలు, వంట సామగ్రి మొ౹౹) ఏవేవి దానం చేస్తే మంచిది?
◆ పితృదేవతలకి ఆవపిండితో చేసిన వంటలు, నువ్వులుతో వంటలు, గోధుమలతో చేసిన అప్పాలు, పెసర, మినపపప్పుతో వంటలు వండడం లేదా ఇవి దానాలు చేయడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు. స్వయంపాకమునకు కందగడ్డ, చామగడ్డ, తోటకూర, బెల్లం, చింతపండు, బెండ, కాకర, పనసకూర, ఎండుమిరప, ఆవాలు, ఆవు నెయ్యి, పంచకదళి (అరటికాయ, అరటిపండు, అరటిపువ్వు, అరటి దూట, అరటి ఆకు), పాలు, పెరుగు, నల్ల మినపపప్పు, పెసరపప్పు, అల్లం, చెరకు రసం మొదలైనవి
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw