" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 అక్టోబర్ 05 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షము తిథి : దశమి ఉదయం 11గం౹౹15ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : శ్రవణం రాత్రి 09గం౹౹28ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : సుకర్మ ఈ రోజు ఉదయం 08గం౹౹21ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹28ని౹౹ నుండి మధ్యాహ్నం 12గం౹౹15ని౹౹ వరకు వర్జ్యం : ఈ రోజు రాత్రి 01గం౹౹13ని౹౹ నుండి 02గం౹౹43ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹47ని౹౹ నుండి మధ్యాహ్నం 01గం౹౹18ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹49ని౹౹ 👉🏻🕉️విజయదశమి🕉️ గురుబోధ విజయదశమి నాడు ఏ శుభకార్యము తలపెట్టినా, అది దిగ్విజయం అవుతుందని ప్రతీతి. ఆశ్వయుజ మాసం శ్రవణానక్షత్రము నాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో అవతరించారు. దశమి నాడు తప్పక శమీపూజ చేసి, ఈ క్రింది శ్లోకాలను చదువుకొంటే సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. 1. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్యాక్లిష్ట కర్మిణీ 2. శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా ధారిణ్యర్జునబాణానాం రామస్య ప్రియవాదినీ