కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 04 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి మ.3.50 కు తదుపరి త్రయోదశి 5 మ.2.43 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.6.59 కు తదుపరి శతభిషం 5 ఉ.6.42 కు
యోగం: శూల రా.7:26 కు తదుపరి గండ 5 సా.4:33 కు
కరణం: బాలవ సా.5.09 కు తదుపరి కౌలవ 5 తె..4.12 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:45-8:32 కు
వర్జ్యం: మ.2.06-3.40 కు
అమృతకాలం: రా.1.09-2.41 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
🕉️ శనిప్రదోషము, గోవత్సద్వాదశి, పద్మనాభద్వాదశి 🕉️
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు చేయాలి.
గురుబోధ:
🕉️గోవత్స ద్వాదశి రోజు సకలదేవతా స్వరూపమైన గోమాతను పూజించడం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని, సకల సంపదలు లభిస్తాయని శాస్త్రవచనం.
సురభి స్తోత్రం👇
https://youtu.be/k9H4Q3qLkt8?si=PS7WfNoiZO4dVTk9
🕉️ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని పద్మనాభ ద్వాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణు స్వరూపమైన అనంతపద్మనాభ స్వామిని పూజిస్తారు.
🕉️శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని జరుగుతున్న వారికి దోష ఉపశమనం.
శని స్తోత్రం పిప్పలాద ప్రోక్తం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=54rRaEOlttF4jmx4
సూర్యపుత్రుడు శనైశ్చరుడు మహానుభావుడు. ఈయనకి సూర్యుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు ఎన్నో వరాలిచ్చారు.
o జన్మలగ్నంలో శని ఉన్నవారు లేదా జన్మలగ్నం నుండి రెండవ స్థానములో శని ఉన్నవారు, అష్టమశని (ఎనిమిదో స్థానంలో శని) ఉన్నవారు, అర్ధాష్టమశని, ఏలినాటిశని ఉన్నవారు 40 రోజులు, రెండు పూటలా ఈ స్తోత్రం చేస్తే శనిప్రభావం తగ్గుతుంది. తీవ్రమైన కష్టనష్టాలు రావు. శుభం జరుగుతుంది.
o సుప్రభాత సమయంలో శుచిగా, పవిత్రంగా శనైశ్చర స్తోత్రము చేయాలి. ఇలా చేస్తే మహాఫలితం వస్తుంది.
o శనివారం నువ్వులనూనె శరీరమంతా రాసుకుని స్నానం చేస్తే అష్టమశని ప్రభావం శాశ్వతంగా తొలగిపోతుంది.
o శనివారంనాడు నువ్వులనూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి, ఆ తైలం కొంచెం కొద్దిగా తీసుకొని, కన్నులు మూసుకొని మన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే నేత్రసంబంధిత పీడలు తొలగిపోతాయి.
o నువ్వులు, నువ్వులనూనె దానం పుచ్చుకున్నవారు ఈ శనైశ్చర స్తోత్రము చదివి, గాయత్రీ మంత్రజపం (పది/ నూరు/సహస్ర) చేసుకుంటే, వారికి దానములు పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టములు ఉండవు. వారికి గ్రహదోషాలూ ఉండవు, వారు మహాత్ములు అవుతారు.