"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షము
తిథి : పంచమి ఉ. 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : రోహిణి రా. 10గం౹౹31ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : సిద్ధి ఉ. 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : గరజి సా. 05గం౹౹31ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹28ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹18ని౹౹ నుండి 05గం౹౹48ని౹౹ వరకు & మ. 02గం౹౹25ని౹౹ నుండి 04గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹16ని౹౹ నుండి 08గం౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹54ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు
🕉️ వ్యతీపాత మహాలయం🕉️
జ్యోతిష్యశాస్త్రం లో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములను కలిపి పంచాంగం అంటారు. అందులో యోగములు 27 ఉంటాయి. ప్రతినెలా వచ్చే వ్యతీపాత యోగం పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకే ఆ వ్యతీపాతయోగం ఉన్న రోజు శుభకార్యాలకు ముహూర్తం పెట్టకుండా శ్రాద్ధము, తర్పణం ఇవ్వడం చేస్తారు. ఈ మహాలయ పక్షంలో వచ్చే వ్యతీపాత యోగాన్ని వ్యతీపాత మహాలయం అంటారు. ఈరోజు పితృదేవతను ఉద్దేశించి శ్రాద్ధం, తర్పణం లేదా స్వయంపాకం ఇవ్వడం చాలా మంచిది. తప్పక పితృస్తోత్రం, శివకేశవ అష్టోత్తరం చేయాలి..
పితృదేవతా స్తోత్రం👇శ్రీ శివ కేశవ అష్టోత్తరం👇*
https://youtu.be/1MoC79bhXT0?si=4NotKQi5I9_RE3sc